తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో సంభాషించిన – ప్రధానమంత్రి

భారీ వర్షాల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్ర శేఖర రావు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి లతో సంభాషించారు.

“భారీ వర్షపాతం కారణంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పరిస్థితులకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను.  రక్షక, సహాయక చర్యలలో కేంద్రం నుండి సాధ్యమైనంత మద్దతు మరియు సహాయానికి హామీ ఇవ్వడం జరిగింది. భారీ వర్షాల కారణంగా ప్రభావితమైన వారి గురించి నేను ఆలోచిస్తున్నాను.” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.